ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

-

మార్చి 13న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో ఏకంగా 37 మంది ఉన్నారు. టీడీపీ మద్దతులో వేపాడ చిరంజీవిరావు, వైసీపీ మద్దతుతో సీతంరాజు సుధాకర్‌, బీజేపీ తరపున సిటింగ్‌ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌, వామ పక్షాల అభ్యర్థిగా కె.రమాప్రభ పోటీ చేయనున్నారు. మిగిలిన అభ్యర్థులంతా ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఐదుగురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు జిల్లావాసులే. కానీ చాలామంది అభ్యర్థుల పేర్లు పట్టభద్రులకు తెలియకపోవడం గమనార్హం. వీరు ప్రచారం కూడా చేయకపోవడం విశేషం. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు మాత్రం సోషల్‌ మీడియా వేదికగా కూడా ఓటర్లకు చేరువవుతున్నారు.

వైసీపీ అభ్యర్థి పేరున ఓటర్ల సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఇంతవరకూ పెద్దగా ప్రచారం చేయలేదు. కానీ, రెండు రోజులుగా ఓటర్ల జాబితా ఆధారంగా ఒక్కొక్కరికీ ఫోన్‌ చేసి.. తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. ప్రభుత్వ పథకాలు పొందిన కుటుంబాల జాబితాలో ఉన్న పట్టభద్రులను గుర్తించి, తమ అభ్యర్థికే ఓటు వేసేలా ఒత్తిడి చేస్తున్నారు. కాగా.. అధికారపార్టీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీని కైవసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వతీరుపై ఇప్పటికే ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఇతరత్రా వర్గాల్లో వ్యతిరేకత ఉంది. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకపోవడం, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువతలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీని ప్రభావం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీపై పడనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version