లోకేశ్ పాదయాత్రకు బ్రేక్.. ఎందుకంటే..?

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను తాత్కాలికంగా ఆపివేయనున్నారు. జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. మధ్యలో తారకరత్న మరణించిన సమయంలో రెండు రోజులు యాత్రకు విరామం ఇచ్చారు. 41 రోజులుగా సాగుతున్న యాత్రలో ఇప్పుడు రెండు రోజుల తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటి వరకు లోకేష్ యాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 520 కిలోమీటర్ల మేర సాగింది. ఈ పాదయాత్రలో ఇప్పటి వరకు 22 కేసులు నమోదు అయ్యాయి.

కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా పాదయాత్రకు విరామం ప్రకటించారు. రేపు, ఎల్లుండి పాదయాత్రకు విరామంపాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఈ నెల 14న మళ్లీ యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. మొత్తం 400 రోజుల పాటు నాలుగు వేల కిలో మీటర్ల మేర యాత్ర చేయాలని లోకేష్ లక్ష్యంగా నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 520 కిలో మీటర్లు పూర్తి చేసారు. స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకం అవుతూ..వారి సమస్యలపైన స్పందిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగానూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి కేంద్రంగా యువతతోనూ లోకేష్ కలవనున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. 13న జిల్లాలో పోలింగ్ జరగనుంది. దీంతో యాత్రలకు అనుమతి లేకపోవటంతో లోకేష్ ఈ రెండు రోజుల తన యాత్రకు చిన్న విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version