ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. తాజా లెక్కలు ఇవే !

హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దీంతో ఎదవ రౌండ్ దాటాకనే 50 శాతం ఓట్ల మేజిక్ ఫిగర్ దాటుతారు ఏమో చూడాలి.

ఇక నల్గొండ-ఖమ్మం-వరంగల్ కౌంటింగ్ విషయనికి వస్తే ఇక్కడ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో లెక్క తేలలేదు. దీంతో ఇక్కడ కూడా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక ఇక్కడ కూడా టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. పల్లా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న మూడో స్థానంలో కోదండరాం ఉన్నారు. ఇక్కడ 16 అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు ఎన్నికల అధికారులు. 25 ఓట్ల లోపు ఉన్న వారి ఓట్లు లెక్కించి ఎలిమినేట్ చేశారు. ఇక ఈరోజు సాయంత్రానికి సరయిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.