నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయడాన్ని ఆహ్వానిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో ట్వీట్ చేశారు.మన రెజ్లర్లు దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచారని వాళ్లను చూసి చాలామంది మహిళలు ఇండియా తరఫున ప్రపంచ వేదికపై నిలవాలని కలలు కంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అలాంటి వారికి న్యాయ, పారదర్శక వ్యవస్థ ముఖ్యమని అన్నారు. తాజాగా కేంద్ర క్రీడ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం భారత రెజ్లింగ్ బలోపేతానికి ఒక మార్గంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇటీవలే ముగిసిన భారత్ రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నిక అయినా సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న సంజయ్ సింగ్ ఎన్నికలలో గెలవడంతో రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా మరో రెజ్లర్ బజరంగ పునియా తన పద్మశ్రీని వెనక్కి ఇస్తున్నానంటూ ప్రకటన చేశాడు.
వీరికి మద్దతుగా మరో పారా రెజ్లర్ వీరేంద్ర సింగ్ తన పద్మశ్రీని కూడా వెనుకకి ఇచ్చిన విషయం తెలిసిందే.