గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు.. కేంద్రంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్‌

-

న్నికలు సమీపిస్తున్న వేళ ఎల్పీజీ గ్యాస్‌పై భారీ తగ్గింపు అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా సిలిండర్‌ ధర పెంచుకుంటూ వెళ్లిన మోదీ సర్కార్‌.. ఉన్నపళంగా రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పైగా ఇది మహిళా సోదరీమణులకు రాఖీ కానుక అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై సామాన్యులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.

2014లో రూ.400గా ఉన్న వంట గ్యాస్‌ ధరను రూ.1200కు పెంచి.. ఇప్పుడు అందులో నుంచి రూ.200 తగ్గించి మహిళలకు కానుక అనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఇన్నేండ్లుగా వంట గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచి.. ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి పేదలకు ఎంతో లబ్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు.

అయితే.. ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ను భారీగా తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. పది, 20 రూపాయలు కాకుండా ఏకంగా 200 రూపాయల వరకు ధర తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జాతీయ పత్రికలు అన్నీ కథనాలు ప్రచురిస్తున్నాయి. ఆగస్ట్ 29వ తేదీ ఢిల్లీలో కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 11 వందల రూపాయల వరకు ఉంది. మోదీ ప్రధానమంత్రి కాక ముందే ఈ గ్యాస్ సిలిండర్ ధర 450 రూపాయలుగా ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో మూడింతలు పెరిగింది. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇది మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అన్నింటి కంటే ముఖ్యంగా దేశంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version