బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.కవిత తరఫు లాయర్ విక్రమ్ చౌదరి రౌస్ అవెన్యూ కోర్టులో కీలక వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారని ఆయన అన్నారు.. కవితకు సుప్రీంకోర్టు ఇచ్చిన రిలీఫ్ ఇంకా అమలులో ఉందని చెప్పారు. ఈడీ విచారణకు కవిత సహకరించారని, అయినా అక్రమంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే… తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా,నిన్న ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.