BIG BREAKING: లిక్కర్ స్కాంలో MLC కవిత పేరు

-

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అమిత్‌ అరోరా అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్‌ చేశారు. ఆయనను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరుతూ… రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఏడు రోజులు రిమాండ్‌ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. అయితే ఈ రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను ఈడీ పేర్కొన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఉందని ఈడీ వెల్లడించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ఈడీ అధికారులు బయటపెట్టారు.

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని పేర్కొంది. సౌత్గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్గ్రూప్ ద్వారా రూ.100 కోట్లను విజయ్నాయర్కు చేర్చినట్లు ఈడీ వెల్లడించింది. దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version