బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ లైంగికంగా వేధించాడంటున్న మోడల్..

లైంగిక పరమైన వేధింపుల నేపథ్యంలో జరిగిన మీటూ ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం బాలీవుడ్ వరకూ పాకి, చాలామంది సెలెబ్రిటీలపై ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో చాలా మంది హీరోల మీదా, దర్శకుల మీదా ఆరోపణలు వచ్చాయి. అలా వచ్చిన వారిలో డైరెక్టర్ సాజిద్ ఖాన్ కూడా ఒకరు. ఈ కారణంగానే సాజిద్ ఖాన్ ని హౌస్ ఫుల్ 4 సినిమా నుండి తప్పించారు.

ఐతే తాజాగా మరో అమ్మాయి సాజిద్ ఖాన్ పై ఆరోపణలు చేస్తుంది. మోడల్ అయిన పాలా ఈ విషయమై ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. హౌస్ ఫుల్ సినిమా టైమ్ లో సాజిద్ ఖాన్ తనని వేధించాడని, అనవసరంగా తాకడానికి ప్రయత్నించేవాడనీ, అంతేకాదు తనముందు బట్టలు విప్పమనేవాడనీ, అలా చేస్తేనే సినిమాలో పాత్ర ఇస్తానన్నాడని చెప్పుకొచ్చింది.

ఐతే ఈ విషయాలన్నింటినీ అప్పుడే ఎందుకు చెప్పలేదో కారణాలు కూడా తెలిపింది. పదిహేడేళ్ల వయసులో తనకి అంత ధైర్యం లేదనీ, అదీగాక ఇండస్ట్రీలో తనకి గాడ్ ఫాదర్ ఎవరూ లేరని, మా అమ్మానాన్నలని నేనే చూసుకోవాలని, అందుకు డబ్బు సంపాదించాలి కాబట్టి అప్పట్లో చెప్పలేదని తెలిపింది. మరి ఈ విషయమై సాజిద్ ఖాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.