‘ఆ’ సర్జరీ ఫెయిలయి మోడల్ మృతి

-

ఈ మధ్య కాలంలో అన్నిటికీ సర్జరీలు చేయించుకోవడం కామన్ అయిపోయింది. వక్షోజాలు, మొహం, పిరుదులు ఇలా ఏది కావాలంటే అది మార్చేసుకుని ఆనంద పడిపోతున్నారు కొంత మంది. అయితే అలా చేయించుకున్న సర్జరీలు వికటిస్తే ప్రాణాలు పోతాయని తెలిసినా అందం మీద మోజుతో పిచ్చ ప్రయత్నాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా మెక్సికో కిమ్ కర్దాషియన్‌గా పేరు తెచ్చుకున్న జోసెలిన్ కానో కూడా ఈ లిస్టులో చేరింది.

30 ఏళ్ల ఈ భామ కాలి ఫోర్నియాలో నివాసం ఉండేది. హిప్ ఆగ్మెంటేషన్ సర్జరీ చేయించుకున్న ఈ భామకు ఆ సర్జరీ వికటించడంతో ప్రాణాలు కోల్పోయింది. సర్జరీ సమయంలో ఆమెకు పోస్టోపెరాటివ్ కాంప్లికేషన్స్ వచ్చాయనీ, అందువల్లే చనిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. సర్జరీ చేయించుకుంటూ డిసెంబర్ 7న చనిపోయింది. నిజానికి అప్పుడే చనిపోయినా… ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు కుటుంబ సభ్యులు. అందం పిచ్చి ప్రాణాలకు ప్రమాదం అనే విషయం ఇప్పటికయినా జనానికి తెలిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news