చౌటుప్పల్ మున్సిపాలిటిని మోడల్ గా తీర్చిదిద్దుతా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

-

మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాను అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చిన సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయనస్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. త్వరలోనే స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ. 5 లక్షలు, ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వలె మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం తమది కాదని అన్నారు.రాబోయే 6 నెలల్లో చౌటుప్పల్ మున్సిపాలిటిని మోడల్ గా తీర్చిదిద్దుతానని రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news