కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు: ప్రధాని మోదీ

-

సికింద్రాబాద్ పర్యటనలో భాగంగా జరుగుతున్న మీటింగ్ లో మోదీ తెలంగాణ ప్రభుత్వం పై మరియు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము దేశంలో ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఆ రాష్ట్రం మాతో కలిసి వచ్చి మాకు సహకరిస్తే అది మరింత వేగంగా కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఏమీ మినహాయింపు కాదు అన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి రావడం లేదన్నారు. ఆ కారణం గానే మీ రాష్ట్రంలో శంకుస్థాపన చేసిన చాలా అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి అని చెప్పారు.

ఇక్కడ మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే కొందరు తమ కుటుంబ ప్రయోజనాల కోసం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక మీదట అయినా.. తెలంగాణ అభివృద్ధి పనులకు అడ్డు పడకుండా ఉంటే చాలని మోదీ ఈ ప్రభుత్వాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version