మోడీ… కేసీఆర్‌… ఓ పాత‌బ‌స్తీ ఒవైసీ

-

ఆలిండియా మ‌జ్లిస్ ఇత్తెహ‌దుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఏర్పాటు చేసిన‌ప్పుడు ఆ పార్టీ ఆశ‌యం వేరు.. ఆ పార్టీ ల‌క్ష్యం వేరు.. త‌రాలు మారాయి.. సంవ‌త్స‌రాలు క‌రిగాయి.. ల‌క్ష్యాలు త‌గ్గాయి..ల‌క్ష‌లు పెరిగాయి.. ఆశ‌యాలు కాగితాల‌కే ప‌రిమిత‌మై గాలికి కొట్టుకుపోయాయి. ఎవ‌రికి ఎక్క‌డ అనుకూలంగా ఉంటే ఆర్థికంగా లాభం.. ఎవ‌రికి ఎక్క‌డ వ్య‌తిరేకంగా ప‌నిచేస్తే పాత‌బ‌స్తీలో మ‌న ఉనికిని మ‌నం కాపాడుకోవ‌చ్చ‌నే లెక్క‌ల‌తోనే ఆలిండియా మ‌జ్లిస్ ఇత్తెహ‌దుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ప‌నిచేస్తోంది. విలువ‌ల‌కు వ‌లువ‌లూడ‌దీస్తోంది.

 

పెట్టుబ‌డి ఎవ‌రు?

ముస్లింల అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకుంటూ తాను మాత్రం దేశ‌వ్యాప్తంగా బ‌లోపేతం కావ‌డంపైనే దృష్టిపెట్టింది. బ‌హిరంగ‌స‌భ‌ల్లో భారీ ప్ర‌సంగాలు.. ప్ర‌త్య‌ర్థుల‌పై ప‌దునైన ఆరోప‌ణ‌లు.. ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తేలా ప్ర‌ణాళిక ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించ‌డం.. మ‌త‌ప‌రంగా చిచ్చుపెట్టే ప్ర‌య‌త్నాలు.. ప్ర‌జ‌ల‌మ‌ధ్య మ‌తాల‌వారీగా విభ‌జ‌న‌… ఒక‌టా.. రెండా.. మూడా.. త‌న స్వార్థం కోసం, త‌న స్వ‌లాభం కోసం ఏమైనా చేస్తాం.. ఎక్క‌డికైనా వెళ్తాం.. అక్క‌డ ముస్లింలు ఉంటేచాలు.. వారే మా ఓటు బ్యాంకు.. వారే మా ఆదాయ వ‌న‌రు.. వారే మా వ్యాపారానికి క‌ర‌దీపిక‌లు.

ఓటుబ్యాంకును చీల్చి బ్యాంకు ఖాతా పెంచుకోవ‌డం

తాను బేరం కుదుర్చుకున్న పార్టీకి హోరాహోరీ పోరు ఎక్క‌డుందో అక్క‌డికి వాలిపోవ‌డం.. ఓటుబ్యాంకును చీల్చ‌డం.. మ‌న బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవ‌డం..అంతే. అవి సార్వ‌త్రిక ఎన్నిక‌లా.. అవి అసెంబ్లీ ఎన్నిక‌లా.. అవి పుర‌పాల‌క ఎన్నిక‌లా? అవి పంచాయితీ ఎన్నిక‌లా? అనేవాటితో మ‌న‌కు ప‌నిలేదు. మీ కోసమే పాత‌బ‌స్తీ వ‌దిలి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చాన‌ని చెప్ప‌డం.. అక్కడ పోటీచేస్తే ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? మ‌న‌కెంత లాభం? అంటూ లెక్క‌లు వేయ‌డం.. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డం.. అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకున్నామా? లేదా? అంటూ ‌సొంత విశ్లేష‌ణ చేసుకోవ‌డం..ఆ త‌ర్వాత తెలిసిందేగా.. ప‌లాయ‌న‌వాదం మ‌ళ్లీ ఇటువైపు తిరిగిచూసేది లేదు. ఎన్నెన్నో అంచ‌నాల‌మ‌ధ్య ఆ పార్టీ అధినేత అలా వాలిపోతారు.. అక్క‌డ అమాయ‌కులైన ముస్లిం ఓట‌ర్లుంటే చాలు.. ఈరోజువ‌ర‌కు పాత‌బ‌స్తీ ఏమైనా అభివృద్ధి చెందిందా? అంటే అదీ లేదు.. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే ఉన్న‌ట్లుగా ఉంటుంది. ఇప్ప‌టికైనా అమ్మ‌.. నాన్నా.. ఓ త‌మిళ అమ్మాయిలా మోడీ.. కేసీఆర్‌‌.. ఓ పాత‌బ‌స్తీ ఒవైసీ అంటూ సొంత పార్టీవారి నుంచే వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను త‌ల‌కెక్కించుకొని ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు పాటుప‌డితే బాగుంటుంద‌ని ముస్లింలే కాదు.. దేశంలోని అన్ని మ‌తాల‌కు చెందిన ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version