ఇది ట్రైలర్ మాత్రమే: మోడీ

-

గడిచిన దశాబ్ద కాలంలో ఎన్డీఏ పాలనలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని చేయాల్సింది చాలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని పార్టీ బహిరంగ సభలో మాట్లాడిన నరేంద్ర మోడీ కేరళ తో పాటు దేశానికి దేశ పురోగతికి ఇంకా చేయాల్సింది ఉందని రాబోయే లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని కూటమికి దక్షిణాది రాష్ట్రాల నుండి మరింత మద్దతు కావాలని అన్నారు.

కేరళలో ఇది అభివృద్ధి సంవత్సరం అవుతుందని ఆదివారం విడుదల చేసిన మోడీకి గ్యారెంటీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు వాగ్దానాలని ప్రస్తావించారు. సభలో కాంగ్రెస్ సగర నేత రాహుల్ గాంధీ మీద మోడీ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ యూపీలో తన కుటుంబానికి చెందిన స్థానాన్ని కాపాడు లేక మౌనంగా ఉన్నారని కరువనూరు బ్యాంకు కుంభకోణం పై మాట్లాడలేదని ఆరోపణలు చేశారు. నేరుగా రాహుల్ గాంధీ పేరుని ప్రస్తావించకుండా కాంగ్రెస్ యువరాజు అని అన్నారు నరేంద్ర మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news