రైతుల ఆదాయం పెంచేందుకు మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న కేబినేట్ సమావేశం జరుగగా.. అందులో రైతుల ఆదాయం పెంచేందుకు మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులు ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన, కృషోన్నతి యోజన కోసం 1,01,321 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ముందుకు వచ్చింది కేబినేట్.
రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్కడి పంటలకు అనుగుణంగా నిర్ణయాలు జరగాలని ప్రధాని చెప్పడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ తో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. అటు క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలకు ఆమోదం తెలిపింది కేంద్రం. మరాఠీ, పాళీ, ప్రక్రిత్, అస్సామీస్, బెంగాల్, భాషలను క్లాసికల్ లాంగ్వేజెస్ గా గుర్తించారు. రైల్వే ఉద్యోగుల కోసం ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ ప్రకటించింది కేంద్ర సర్కార్