మోడీ నే భారత జాతిపిత..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!!

-

భారత దేశ జాతిపితగా అందరికి తెలిసింది మహాత్మా గాంధీ. దేశానికి ఆయన తండ్రి వంటివడుగా ఆ బిరుదుని అందుకున్నారు. ఇప్పటికీ జాతిపిత అంటే మహాత్మాగాంధీ అంటారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దేశ జాతిపిత ని మార్చేశారు. హౌడీ మోడీ కార్యక్రమంతో మోడీ , ట్రంప్ ల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. అమెరికాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మోడీ కోసం ఇండో అమెరికన్స్ తో నిండిన సభ, మోడీ కోసం మోగిన చప్పట్లు, చేసిన గోలలు చూసి ట్రంప్ షాక్ తిన్నాడు.

ఈ క్రమంలోనే మోడీ ట్రంప్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చించిన వీరిద్దరూ  ఆ తరువాత మీడియాతో మాట్లాడిన మోడీ ట్రంప్ లు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హౌడీ మోడీ సభకి వచ్చినందుకు ట్రంప్ కి కృతజ్ఞతలు తెలిపారు మోడీ. ట్రంప్ భారత్ కి మాత్రమే మంచి మిత్రుడు కాదు, తనకి కూడా మంచి మిత్రుడు అంటూ ప్రకటించారు.

ఆ తరువాత మాట్లాడిన ట్రంప్ మోడీ ని ఉద్దేశించి మాట్లాడుతూ మోడీ భారత్ కి తండ్రిలాంటి వారని ప్రకటించారు. భారత ప్రజలు మోడీ పై ఎంతో విశ్వాసం , అభిమానం ఉంచారని అన్నారు. హౌడీ మోడీ కార్యక్రమం చూసి నేను ఆశ్చర్యపోయాను అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద విషయంలో మోడీ కి ఒక క్లారిటీ ఉందని ఎలాంటి పరిస్థితులనైనా సరే మోడీ డీల్ చేయగాలని తెలిపారు. అయితే ఇక్కడ మోడీని జాతి పితగా ట్రంప్ పేర్కొనడం అతిపెద్ద చర్చగా మారింది. మరి ఈ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకి దారి తీస్తాయో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version