ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ ఎంతగా శ్రమించారో, ఎన్ని సవాళ్లు ఎదుర్కున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జైలు జీవితం గడిపిన జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పోరాటంలో చివరికి విజయం సాధించారు. ఎవరూ ఊహించని విధంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే జగన్ రెడ్డిని జైలుకి పంపితే ఇక వైసీపీ పని ఖాళీనే అనుకున్న సమయంలో తండ్రి ఆశయాలు , అన్న కి జరిగిన అన్యాయాన్ని, తమ కుటుంభానికి జరిగిన అవమానాల్ని ప్రజలకి తెలియజేస్తూ అన్న మీకోసం మళ్ళీ వస్తాడు అంటూ వైసీపీ భాద్యతలని భుజాన మోసి పాదయాత్ర చేస్తూ, వాడైన మాటలతో అన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వెళ్ళిన షర్మిల సేవలు అనిర్వచనీయం అనే చెప్పాలి.
షర్మిల నడుం కట్టుకుని చేసిన పాదయాత్ర ఎవరూ ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది. వైసీపీ అధికారంలోకి రావడానికి ఆమె చేసిన ప్రచారాలు, చంద్రబాబు లోకేష్ లపై చేసిన పదునైన వ్యాఖ్యలు కూడా ఒక కారణమే. అయితే పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వారికి జగన్ మోహన్ రెడ్డి పదవులు కట్టబెట్టారు. కనీ షర్మిల కి మాత్రం ఎటువంటి పదవులు ఇవ్వలేదు అనుకున్న సమయంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే షర్మిలకి కీలక పదవిని కట్టబెట్టనున్నారని తెలుస్తోంది.
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యింది మొదలు తీరిక లేకుండా ప్రజలకోసం పాటు పడుతున్నారు. ఒక పక్క ప్రజా సమస్యలు, అధికారులతో చర్చలు,ఇలా సమయాన్ని పూర్తిగా వేచ్చిస్తునారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి పార్టీ వ్యవహారాలూ అన్నీ చూసుకోవడానికి షర్మిలకి వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని భావిస్తున్నారట జగన్. అయితే కుటుంభానికి పదవులు ఇవ్వడంలో వెనకడుగు వేసే జగన్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట వైసీపీ నేతలు.