తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బలమే ఎక్కువ..మరి బీజేపీ బలంపై టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టడం ఏంటని అనుకోవచ్చు…అవును బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న ఒక ఏరియాపై కారు పార్టీ దృష్టి పెట్టింది…ప్రస్తుతం రాజకీయాలు ఎక్కువగా సోషల్ మీడియా వేదికగానే ఎక్కువ జరుగుతున్న విషయం తెలిసిందే..అసలు సోషల్ మీడియాలోనే రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఏ విషయమైన ప్రజలకు త్వరగా చేరుతుంది. చెప్పాలంటే ప్రస్తుతం సోషల్ మీడియానే రాజకీయాలని నడిపిస్తుందని చెప్పొచ్చు.
అలా రాజకీయ వేదికగా ఉన్న సోషల్ మీడియాలో కమలం పార్టీ చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు…దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో బలమైన పార్టీగా బీజేపీ ఉంది..ఆ పార్టీని బీట్ చేసే పార్టీ మరొకటి కనబడటం లేదు..సోషల్ మీడియా ద్వారానే ప్రత్యర్ధులకు బీజేపీ చెక్ పెట్టేస్తుంది. ఇక ఇదే క్రమంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి…అధికారం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ…సోషల్ మీడియా వేదికగానే కారు పార్టీకి చుక్కలు చూపిస్తుంది.
సోషల్ మీడియాలోనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది..పైగా సోషల్ మీడియాలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది..వేలాది మంది బీజేపీ కోసం పనిచేస్తున్నారు…పై నుంచి ఆదేశాలు రావడం ఆలస్యం ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిపోతారు. ఇక తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలని పూర్తి స్థాయిలో తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ విఫలమవుతుందనే చెప్పాలి..ఎందుకంటే సోషల్ మీడియాలో బీజేపీకి ఉన్నంత బలం టీఆర్ఎకు లేదు.
అందుకే ఇప్పుడు ఆ బలాన్ని మరింత పెంచుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధిష్టానం రెడీ అవుతుంది…మండల, గ్రామ స్థాయి నుంచి వందల మంది కార్యకర్తలకు సోషల్ మీడియా అంశంపై ట్రైనింగ్ ఇచ్చి…బీజేపీపైకి వదలాలని చూస్తున్నారు…బీజేపీ ఒక్క విమర్శ చేస్తే..దానికి వెంటనే కౌంటర్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి సోషల్ మీడియాలో కమలాన్ని కారు బీట్ చేస్తుందో లేదో.