మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రెండవ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాద్ సహా పలువురు కేంద్రమంత్రులు ఘనంగా నివాళులు అర్పించారు. వాజ్ పేయి స్మారకం సదైవ్ అటల్ దగ్గరకు చేరుకున్న వీరు ఆయనకు శ్రధ్దాంజలి ఘటించారు. వాజ్ పేయి దత్తపుత్రిక నమిత కౌల్ భట్టాచార్య తన కూతురు, వాజ్ పేయి మనవరాలు నిహారికతో కలిసి వచ్చి ఆయనకు తమ నివాళులు అర్పించారు.
ఆగస్ట్ 16 2018 సంవత్సరంలో 93 ఏళ్ల వయసులో వాజ్ పేయి ఎయిమ్స్ లో వయో భారం, అనారోగ్య తదితర కారణాలతో కన్నుమూశారు. ఇక వాజ్ పేయి జయంతిని గత ఏడాది గుడ్ గవర్నెన్స్ డే గా జరుపుకుంది బీజేపీ. మరి ఈ ఏడాది ఆ ప్రస్తావనే ఎక్కడా వచ్చినట్టు కనిపించలేదు. ఇక సదైవ్ అటల్ మెమోరియల్ ను ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఈ నిర్మాణానికి నిధులను అటల్ స్మృతిన్యాస్ సొసైటీ అందించింది.