రాష్ట్రం తీసుకువచ్చిన పథకాలు ఎక్కువగా ప్రజల్లోకి వెళతాయి. ప్రజలు ఆ పథకాలను వినియోగించుకుంటారు కానీ కేంద్రం తీసుకువచ్చే పథకాలు పెద్దగా ప్రజల్లోకి వెళ్లవు. అయితే కేంద్రం తీసుకువచ్చిన పథకాలలోనూ కొన్ని మంచి పతాకాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కూడా ఒకటి. ఇల్లు లేని పేద వారికి ఇల్లు కొనుగోలు, నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా ఇళ్లులేని పేదవారికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇల్లు కొనుగోలు, నిర్మాణం కోసం 2లక్షలు ఇస్తున్నారు. ఈ పథకాన్ని 2015 లో ప్రధాన మంత్రి ప్రారంభించారు. అయితే 2021 మార్చిలో పథకం ముగిసిపోయింది. కాగా ఈ పథకాన్ని మళ్లీ కొనసాగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపడం తో 2024 మార్చి నెల వరకూ పొడిగించారు. ఇక ఈ పథకం గడువును పెంచడం తో మరి కొంతమంది ఇల్లు కట్టాలనుకుని కల కనేవారికి మేలు చేకూరనుంది.