సింగరేణిలో మోగిన సమ్మె సైరన్… నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మె..

-

సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. చాలా రోజుల పాటు సింగరేణిలో సమ్మె జరగలేదు. అయితే సింగరేణి ప్రయోజనాల కోసం కార్మికులు సమ్మెకు వెళ్తున్నారు. సింగరేణిలో 4 కోల్ బ్లాక్స్ ను ప్రైవేటీకరించేందుకు, వేలం వేయడానికి కేంద్రం సిద్దమైన నేపథ్యంలో కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తు సమ్మెకు వెళ్తున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు కార్మికులు విధుల్లోకి హాజరు కావడం లేదు. కోల్ బ్లాక్స్ వేలాన్ని ఆపాలంటూ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీకి లేఖ రాశారు.

సింగరేణిలోని నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్య గూడెం బ్లాక్ 3,  సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటికరించడాన్ని కార్మికులు వ్యతిరేఖిస్తున్నారు. దీంతో పాటు తమ ఇతర డిమాండ్లను కూడా నెరవేర్చాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంపు, అన్ ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40కి పెంచాలని, కార్మికుల అలియాస్ పేర్లను మార్చాలని, ఏడాది నుంచి మెడికల్ బోర్డును నిర్వహించ లేదని, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఏడాది కాలంగా మెడికల్ బోర్డు లేని కారణంగా డిపెండెంట్ల వయసు పెరిగిందని.. వారికి కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news