పాన్‌కార్డు విషయంలో మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం..?

-

మనకి వున్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరాలు తెలియాలంటే పాన్ కార్డు తప్పక ఉండాలి. అలానే ఇతర ఆర్థికపరమైన పనుల కోసం కూడా పాన్‌ కార్డు తప్పని సరి. అయితే పాన్ కార్డు కి సంబంధించి కీలక మార్పు ని కేంద్రం చేయనున్నట్టు తెలుస్తోంది.

కేంద్రం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ లో బడ్జెట్‌ను సమర్పించనుంది వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనులకు పాన్‌ కార్డు తో పాటు ఇతర పత్రాలు కూడా ఇవ్వాల్సి ఉందట. అన్ని రకాల వ్యాపారాల గుర్తింపు ప్రక్రియకు పాన్‌ కార్డు తప్పని సరి చేయనున్నారు.

2023-24కు సంబంధించి బడ్జెట్ లో దీనికి సంబంధించి లీగ‌ల్ ఫ్రేమ్‌వ‌ర్క్ చేయనున్నారు. ఇప్పుడు చూస్తే వ్యాపారులు, ఇన్వెస్టర్లు ఆయా ప్రాజెక్టులకు క్లియరెన్స్‌, అధికారులు, శాఖల నుంచి అప్రూవల్‌ కోసం ఒకటి కంటే ఎక్కువ గుర్తింపు పత్రాలు సబ్మిట్ చెయ్యాల్సి ఉండేది. కానీ ఇక నుంచి ఇన్వెస్టర్లు, వ్యాపారుల కి పాన్‌కార్డు ఒక్కటే సమర్పించేలా మంత్రి నిర్మలా సీతా రామన్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కనుక ఇది జరిగితే ఇక మీదట పాన్ కార్డు ఒకటే సబ్మిట్ చేస్తే సరి పోతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version