I-N-D-I-A కూటమిపై మోదీ కీలక వ్యాఖ్యలు

-

పార్లమెంటు లైబ్రరీ భవనంలో ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు జరిగింది. సమావేశానికి ప్రధాని మోదీ చేరుకోగానే ఆయన నేతలంతా చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. విపక్షాల ఇండియా కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. I-N-D-I-A అని పేరు పెట్టుకొన్నంత మాత్రాన… ప్రతిపక్షాల తీరు మారుతుందా..? అని ప్రశ్నించారు. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందన్నారు.

ఇలాంటి దశ, దిశ లేని ప్రతిపక్షాన్ని తాను ఎప్పుడూ చూడలేదని బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన ట్వీట్ లో… ఒక పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయితే, తోటి విద్యార్థులు విమర్శలు చేశారని, అప్పుడు ఆ పిల్లాడి తల్లిదండ్రులు అతని పేరును మార్చారని, ఇది I-N-D-I-A అనే విపక్షాలకూ వర్తిస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version