దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వందకోట్ల మైలురాయిని చేరుకోవడంపై ప్రధాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ… కరోనా మహమ్మారి కట్టడికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. మన దేశ శాస్త్రవేత్తలు ఆధునిక టెక్నాలజీతో టీకాలు రూపొందించారని అన్నారు. వ్యాక్సిన్ల విజయంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అయ్యిందని మోడీ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా కంపెనీలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ప్రధాని తెలిపారు. దేశంలో యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఒకప్పుడు విదేశీ వస్తువులకు డిమాండ్ ఉండేది కానీ ఇప్పుడు మేకిన్ ఇండియా వస్తువులకు ప్రాధాన్యత పెరిగింది అని చెప్పుకొచ్చారు. భారత్ ఫార్మ శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని మోడీ వ్యాఖ్యానించారు.