నిన్న మనం చరిత్ర సృష్టించాం :మోడీ

దేశంలో వందకోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేయడంపై ప్రధాని మోడీ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ…. నిన్న మనం చరిత్ర సృష్టించామని అన్నారు. యావత్ ప్రపంచం మన దేశం వైపు చూస్తోంది అని మోడీ వ్యాఖ్యానించారు. కరోనా పై పోరాటం లో భారత్ మరో మైలురాయిని దాటిందని అన్నారు. మన దేశం ఎంత సంకల్పంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అని అన్నారు.

భారతదేశాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని మోడీ వ్యాఖ్యానించారు. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ విజయం సాధించామని చెప్పారు. కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొంటామని అన్నారు. సబ్ కా సాత్…సబ్ కా వికాస్…సబ్ కా వ్యాక్సిన్ అనేది మన నినాదం అన్నారు. వందకోట్ల వ్యాక్సిన్ లు వేసి కొత్త చరిత్ర సృష్టించిందని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చుస్తున్నయంటు మోడీ హర్షం వ్యక్తం చేశారు.