నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేవరకు బూట్లు ధరించనని 14 ఏళ్ల క్రితం హర్యానాలోని కైథల్‌కు చెందిన రాంపాల్ కశ్యప్ ప్రతిజ్ఞ చేయగా.. 2014లో ప్రధాని పీఠం ఎక్కి తన కోరిక నెరవేరినప్పటికీ.. మోడీని రాంపాల్ కశ్యప్ కలవలేకపోయారు.
మోడీని కలిసిన తర్వాతే చెప్పులు వేసుకోవాలని కశ్యప్ ఇప్పటివరకు వేచి ఉన్నట్లు సమాచారం. సోమవారం(ఏప్రిల్ 14) హర్యానాకు వచ్చిన ప్రధాని ఈ విషయం తెలుసుకుని..స్వయంగా రాంపాల్ కశ్యప్‌కు ఫోన్ చేసి పిలిపించుకుని స్పోర్ట్స్ షూ బహుమతిగా అందించారు. కశ్యప్ బూట్లు ధరిస్తుంటే ఆయనకు స్వయంగా ప్రధాని మోడీ సహాయం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.