మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాల మధ్య మరో కొత్త పంచాయితీ

-

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య తెరపైకి మరో వివాదం వచ్చింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి స్మార్ట్ సిటీలకు నిధులు విడుదల కారణమవుతోంది. తమ వాటా కింద ఇచ్చే నిధులను విడుదల చేస్తున్నా… తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాను విడుదల చేయడం లేదని ఆరోపిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే ఇక తాము నిధులు విడుదల చేయలేముంటున్న కేంద్రం… స్మార్ట్ సిటీస్ మిషన్ కింద తెలంగాణలోని గ్రేటర్ వరంగల్, కరీంనగర్ ఎంపిక అయింది. స్మార్ట్ సిటీ మిషన్ మార్గదర్శకాలు ప్రకారం స్మార్ట్ సిటీస్ గా ఎంపికైన నగరాలకు కేంద్రం నుంచి 500 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ సంవత్సరం జూన్ 23 తో స్మార్ట్ సిటీస్ గా ఎంపికైన నగరాల్లోని ప్రాజెక్టుల పూర్తి కానుంది. స్మార్ట్ సిటీస్ గా ఎంపికైన నగరాలకు దేశంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొంది కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version