కరోనావైరస్ వ్యాక్సిన్ డెలివరీ, పంపిణీ మరియు నిర్వహణ ప్రభుత్వం సిద్దం కావాలని ఇప్పుడు కేంద్రం భావిస్తుంది. ఇక దీనిపై శుక్రవారం మోడీ సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ రవాణా, నిల్వ సహా అనేక అంశాలను ఆయన చర్చించారు. ప్రభుత్వ సన్నాహాలలో కోవిడ్ -19 వ్యాక్సిన్ డెలివరీ మరియు పర్యవేక్షణ కోసం ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం ని తయారు చేసారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు ఇతర బలహీన వర్గాలను అధికారులు గుర్తించారు.
టీకా డ్రైవ్ కోసం సిబ్బందిని కూడా ఎంపిక చేస్తున్నారు. ఇక త్వరలోనే ఆయన సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. వచ్చే వారం కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిల్వ సహా అనేక అంశాలకు సంబంధించి సీఎంల అభిప్రాయం ఆయన తెలుసుకునే అవకాశం ఉండవచ్చు.