మగవాళ్ళు బయటకి బలంగా కనిపిస్తారు. కానీ లోపల స్ట్రాంగ్ గా ఉండరు. అదే ఆడవాళ్ళు బయటకి చాలా సున్నితంగా ఉంటారు. కానీ లోపల వారున్నంత స్ట్రాంగ్ గా ఎవరూ ఉండరు.. ఏదో సినిమాలో కూడా ఈ డైలాగ్ ఉంటుంది. సినిమా డైలాగ్ అయినా కూడా అది నిజమే తాజా అధ్యయనం వెల్లడి చేస్తుంది.
బయట జనాల ముందు పవర్ ఫుల్ గా కనిపించే మగవాళ్ళు, వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రైవేటు లైఫ్ లో అంత పవర్ ఫుల్ గా కనిపించరు. వ్యక్తిగత జీవితాల్లో బలంగా నిలబడడం అనేది ఆడవాళ్లకైనా, మగవాళ్ళకైనా చాలా ముఖ్యమే. కావాల్సిన దాని కంటే ఎక్కువ డబ్బు, సమాజంలో పరపతి మొదలైన వాటి కారణంగా మగవాళ్ళు తాము బలంగా ఉన్నామని ఫీల్ అవుతుంటారు. అదే వారి బలం అని నమ్ముతుంటారు.
అమెరికాలోని విశ్వవిద్యాలయం 808మగవాళ్ళపై ఈ విషయమై సర్వే చేసింది. మీ జీవితాల్లో ఏది ముఖ్యమని ఎక్కువగా నమ్ముతున్నారు. అలాగే మీ ప్రయాణంలో ఎక్కడ మీరు చాలా పవర్ ఫుల్ అని విశ్వసిస్తున్నారని ప్రశ్నలు వేసింది. ఈ సర్వేలో ఎక్కువ శాతం మంది సమాజంలో హోదా, ఉద్యోగం, పేరు మొదలైన విషయాలే పవర్ ఫుల్ గా అనిపిస్తాయని తెలిపారు.
దీని ప్రకారం మగవాళ్ళు, పబ్లిక్ లైఫ్ లోనే తమకి ఎక్కువ పవర్ ఉందని చెప్పారు. ప్రైవేట్ లైఫ్ లో వారంతా తక్కువ బలం కలిగి ఉన్నారని అర్థం అవుతుంది. కాకపోతే ఇందులో పాల్గొన్న అభ్యర్థులందరూ, ప్రైవేటు లైఫే చాలా ముఖ్యం అని వెల్లడించారు.
ఇంటిని చూసుకుంటూ, పిల్లల్ని పెద్ద చేయడంలో ప్రముఖ పాత్ర వహించే ఆడవాళ్ళు, లోపల చాలా స్ట్రాంగ్ గా ఉంటారట. ఇంటిని చక్కబెట్టడంలో ఆమె చూపించే పనితనం ఆమెని చాలా పవర్ ఫుల్ గా చేస్తాయి. అందుకే అటు వర్క్ చేసుకుంటూ కూడా ఇంటి పని చేసుకునే ఆడవాళ్ళు కనిపిస్తారు గానీ, మగవాళ్ళు అంతగా తారసపడరు.