ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన మొదటి వన్ డే కు సమయం ఆసన్నమైంది. కాసేపటి క్రితమే ఇండియా కెప్టెన్ కె ఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుంది… ఈ పిచ్ ఛేజింగ్ కు అనుకూలంగా ఉంటుందని భావించి ఫీల్డింగ్ తీసుకున్నట్లు రాహుల్ చెప్పాడు. ఇక జట్టు విషయానికి వస్తే.. శుబ్ మాన్ గిల్, ఋతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా మరియు షమీ లు తుది జట్టులో చోటు సంపాదించుకున్నారు. స్క్వాడ్ లో ఉన్న వారిలో తెలుగు ఆటగాళ్లు తిలక్ వర్మ మరియు సిరాజ్ లకు చోటు దక్కకపోగా… వాషింగ్టన్ సుందర్ మరియు ప్రసిద్ద కృష్ణ లు సైతం బెంచ్ కె పరిమితం కానున్నారు.
ఇక ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే మత్యు షార్ట్ వన్ డే డెబ్యూ చేశాడు.. సౌత్ ఆఫ్రికా తో ఆడని వారిలో స్టీవ్ స్మిత్, పాట్ కమిన్స్ లు జట్టులోకి వచ్చారు. మరి ఈ రోజు జరగనున్న మ్యాచ్ హోరా హోరీగా జరగనుంది.