కొడుకు కోసం క్రిష్ ని లైన్లో పెట్టిన బాలయ్య…!

-

నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడు అంటూ నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అతని సినీ రంగ ప్రవేశం విషయంలో ఎప్పుడూ ఏదోక వార్త రావడమే గాని అతను సినిమాల్లోకి వచ్చేది మాత్రం దాదాపుగా కనపడటం లేదు ఇప్పుడు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు.

త్వరలోనే ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడానికి సిద్దమవుతున్నారు. ఈ నేపధ్యంలోనే కొడుకుని వెండి తెర మీద చూపించే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నారు బాలకృష్ణ. ఇప్పటికే కొడుకుని పరిచయం చేయడానికి క్రిష్ ని కూడా అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే క్రిష్ ద్వారా తన కొడుకుని వెండి తెర మీద పరిచయ౦ చేయడానికి తానే నిర్మాతగా మారాలని బాలకృష్ణ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో క్రిష్ సినిమా అయిన తర్వాత ఈ సినిమాను చేసే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే అతనికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో తాను కూడా ఉండాలని బాలకృష్ణ భావిస్తున్నారని టాక్. ఇది పౌరాణిక చిత్రం అని, తమ కుటుంబంలో దాదాపు అందరూ ఇలాగే సినిమాల్లోకి వచ్చారని కాబట్టి అది మంచి శకునం అని బాలయ్య భావించే క్రిష్ ని అలాంటి కథ రెడీ చేయమని కోరినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version