కరోనా, లాక్ డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమైన వాళ్లకు వారం రోజుల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో వల్ల మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. షోలో ఎక్కువగా ముక్కూ మొహం తెలియని వాళ్లే ఉన్నప్పటికీ మోనాల్ గజ్జర్, గంగవ్వ, నోయల్, లాస్య లాంటి పరిచయం ఉన్న కంటెస్టెంట్ల వల్ల షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. బిగ్ బాస్ హౌస్ లోని కొందరు కంటెస్టెంట్లు షోపై హైప్ పెరగడానికి, భారీగా టీఆర్పీలు రావడానికి కారణమవుతున్నారు.
మిగతా ఇంటి సభ్యులతో పోలిస్తే మోనాల్ గజ్జర్, గంగవ్వ వీక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ కు తెలుగు రాదని మనందరికీ తెలిసిందే. అయితే ఆమెకు తెలుగులో చిన్నచిన్న పదాలు కూడా తెలియదు. శరీర అవయవాలైన కళ్లు, ముక్కు, పెదవులు, కాళ్లు లాంటి సింపుల్ పదాలను కూడా మోనాల్ పలకలేదు. భాష విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ మోనాల్ మాత్రం తెలుగు మాటాడేందుకు ప్రయత్నిస్తోంది.
బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్లతో గ్లామరస్ గా కనిపించే బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆమెకు తెలుగు రాకపోయినా తెలిసీ తెలియని పదాలతో మాట్లాడుతుంటే మోనాల్ తెగ ముద్దొచ్చేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మోనాల్ కు చిన్న చిన్న పదాలు కూడా తెలియవా..? అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. గంగవ్వతో సాన్నిహిత్యం ఏర్పరచుకుని తెలుగు నేర్చుకోవాలని మోనాల్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
అయితే ఈ సన్నివేశాలన్నీ బిగ్ బాస్ షోలో కనిపించకపోయినా అన్ సీన్ లో ఉన్నాయి. ఏదేమైనా తన చలాకీతనంతో మోనాల్ రోజురోజుకు వీక్షకుల్లో అభిమానులను పెంచుకోవడం గమనార్హం.