మొబైల్స్ తయారీదారు ఒప్పో తన ఫోన్లలో యూజర్లకు అందిస్తున్న కలర్ ఓఎస్‌కు గాను నూతన అప్‌డేట్‌ను సోమవారం విడుదల చేసింది. కలర్ ఓఎస్ 11 ను ఒప్పో విడుదల చేసింది. దీన్ని ఆండ్రాయిడ్ 11 ఆధారంగా డెవలప్ చేశారు. యూజర్లకు ఈ ఓఎస్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇస్తుంది. అలాగే పలు కొత్త ఫీచర్లు కూడా ఈ అప్‌డేట్‌తో యూజర్లకు లభిస్తున్నాయి.
కొత్త అప్‌డేట్‌లో యూజర్లకు ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, ఆకట్టుకునే థీమ్స్, వాల్‌పేపర్లు, ఫాంట్స్, ఐకాన్లు, రింగ్ టోన్స్ లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ డార్క్ మోడ్ ను పిచ్ డార్క్, బ్లూ డార్క్, గ్రే డార్క్ కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. అలాగే ఏదైనా ఇమేజ్‌రూపంలో ఉన్న టెక్ట్స్‌ను కాప్చర్ చేసి దాన్ని టెక్ట్స్ రూపంలోకి మార్చగలిగేలా నూతన ఫీచర్‌ను ఇచ్చారు. దీని సహాయంతో చాలా సులభంగా ట్రాన్స్‌లేట్ కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా పలు అద్భుతమైన ఫీచర్లను కూడా కొత్త అప్ డేట్‌లో ఒప్పో ఫోన్ యూజర్లు పొందవచ్చు.
ఇక కలర్ ఓఎస్ 11 (ఆండ్రాయిడ్ 11) అప్‌డేట్ ఒప్పో ఫైండ్ ఎక్స్2, ఎక్స్2ప్రొ, ఎక్స్2 ప్రొ లంబోర్గిని ఎడిషన్లకు ప్రస్తుతం విడుదలైంది. సెప్టెంబర్ 30 నుంచి ఇదే అప్ డేట్ రెనో 3 4జి, రెనో3 ప్రొ 4జి, ఎఫ్17 ప్రొ ఫోన్లకు లభిస్తుంది. అలాగే అక్టోబర్ లో రెనో 4 ప్రొ 5జి ఫోన్‌కు, నవంబర్‌లో రెనో 4 5జి, రెనో 4 ప్రొ 4జి ఫోన్లకు, డిసెంబర్‌లో రెనో 4 4జి, ఎఫ్11, ఎఫ్11 ప్రొ, ఎఫ్11 ప్రొ అవెంజర్స్ ఎడిషన్, ఎ9, ఎ92, ఎ72, ఎ5 ఫోన్లకు, 2021 జనవరిలో రెనో 10ఎక్స్ జూమ్, రెనో 2, రెనో 2 ఎఫ్, రెనో 2జడ్, రెనో 3 ప్రొ 5జి, ఎ91, ఎఫ్15 ఫోన్లకు లభిస్తుంది. తరువాత రెనో, రెనో జడ్, ఎ5 2020, ఎ9 2020 ఫోన్లకు కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వస్తుంది.