కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఉపాధి కోల్పోయారు. అప్పటి వరకూ బాగా నడుస్తున్న చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. దాంతో చాలామందికి నిరుద్యోగం ఆవరించింది. కావాల్సినన్ని డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా టైమ్ లో అనవసర ఖర్చులు తగ్గించుకుని, అవసరమైన వాటికి మాత్రమే వాడుతూ, డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం.
అత్యవసర నిధి
కరోనా వల్ల పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదన ఒక సత్యం అందరికీ బోధపడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడైనా అత్యవసర నిధి ఉంచుకునేలా చూడండి. మరీ అత్యవసరం అయితే తప్ప ముట్టుకోకూడని డబ్బులని అత్యవసర సమయం కోసం మాత్రమే వాడాలి. ఇప్పటి దాకా అత్యవసర నిధిని కూడబెట్టని వాళ్ళు ఇకనైనా ఎంతో కొంత మొత్తం అత్యవసర నిధి కోసం డబ్బుని జమ చేయండి. ఆల్రెడీ అత్యవసర నిధిలో దాచిన వాళ్ళు ఆ డబ్బుని బయటకి తీయండి. అది నిజంగా అత్యవసరం అయితేనే అని గమనించండి.
అవసరాలకి మాత్రమే వాడండి
కనీస అవసరాలకి మాత్రమే డబ్బులని వాడండి. డబ్బులు ఖర్చు చేయకపోతే నిజంగా నడవదు అన్న పక్షంలో మాత్రమే డబ్బులు బయటకి తీయండి.
లైఫ్, హెల్త్ ఇన్స్యూరెన్స్
డబ్బు పట్ల మీ మేనెజ్మెంట్ సరిగ్గా ఉంటే ఇన్స్యూరెన్సులు కడుతుంటారు. ముఖ్యంగా లైఫ్, హెల్త్ ఇన్స్యూరెన్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి రెండూ మీ వద్ద ఉంచుకుంటే సగం టెన్షన్ పోయినట్టే. ఆర్థిక పాఠాలు తెలిసిన వారు దీన్ని మిస్ చేయరు. ఫస్ట్ వేవ్ తర్వాత ఇంకా ఇన్స్యూరెన్స్ ప్లానింగ్ చేసుకోకపోతే ఇప్పుడే చేయండి.
కనీస అవసరాల కోసం చేస్తున్న పెట్టుబడిని ఆపకండి.
సెకండ్ వేవ్ వల్ల మీ ఆదాయం తగ్గిపోయి ఉండవచ్చు. అయినా కూడా మీ భవిష్యత్తు అవసరాల కోసం డబ్బులని పెట్టుబడి పెట్టడం ఆపవద్దు. అలా అని తిండి మానేసి భవిష్యత్తు కోసం డబ్బులని దాచాల్సిన పనిలేదు.