TEASER : ‘మంత్ ఆఫ్‌ మధు’ టీజర్ విడుదల

-

నవీన్ చంద్ర హీరోగా.. నటి కలర్స్ స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది. ఇందులో నవీన్‌చంద్ర వింటేజ్‌ లుక్‌లో యువకుడిగా కనిపించారు. టీజర్‌ని బట్టి చూస్తే భార్యాభర్తల మధ్య క్షణికావేశంలో వచ్చే చిన్న తగాదాలు.. దానివల్ల వారిద్దరి జీవితాల్లో ఏర్పడే కలతల నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ బట్టి తెలుస్తోంది. ‘‘20 ఏళ్ల బాధ.. ఇప్పుడు నీకు 20 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పలేను. చెప్పే ఉద్దేశం కూడా లేదు’’ అని స్వాతి చెప్పే డైలాగ్ హృద్యంగా సాగింది.

‘‘నేను నీకో విషయం చెబుతున్నా కళ్లు మూసుకో. ఐ లవ్‌ మధు’’ అంటూ స్వాతి చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. ‘‘20 ఏళ్ల క్రితం నెత్తినోరు బాదుకున్నా వినకుండా.. ఆ మధుగాడిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో వాడితోనే విడాకులు కావాలంటూ రోడ్డు ఎక్కావు. సరైన కారణాలు కూడా చెప్పడం లేదు’’ వంటి సంభాషణలు ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version