పూనమ్ కౌర్ చేతిని రాహుల్ గాంధీ కావాలని పట్టుకోలేదు – కొండా సురేఖ

-

భారత్ జోడో యాత్రపై బిజెపి అసత్యాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ. పూనమ్ కౌర్ చేతిని రాహుల్ గాంధీ కావాలని పట్టుకోలేదని.. దీనిపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి నేతల చిల్లర ప్రచారాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రకు జనాలను తరలిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. పార్టీలకతీతంగా జనాలు వస్తున్నారని విషయం అందరికీ అర్థమవుతుందని చెప్పారు.

టిఆర్ఎస్ లో నిరంకుషత్వ పాలన నడుస్తుందని.. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా మాట్లాడే పరిస్థితి లేదని విమర్శించారు. కెసిఆర్ కు ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ లాగా జనాల్లో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా పేదల పక్షమేనని అన్నారు. బిజెపి, టిఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి ఫాం హౌస్ డ్రామా ఆడాయని.. కాంగ్రెస్ ను ఓడించడమే ఈ పార్టీల లక్షమని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version