RBI: దేశంలో మరో ఎనిమిది కొత్త బ్యాంక్స్…!

-

మన దేశం లో మరి కొన్ని కొత్త బ్యాంక్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరి దానికి సంభవించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఆర్‌బీఐ తాజాగా బ్యాంక్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న 8 సంస్థల పేర్లను వెల్లడించింది. అయితే ఇవి యూనివర్సల్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంది. యూనివర్సల్ ప్రైవేట్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటు కోసం అవసరమైన లైసెన్స్ పొందడం కోసం ఈ దరఖాస్తులు వచ్చాయని చెప్పడం జరిగింది. ఆర్‌బీఐ 2016లో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన సంస్థలు బ్యాంక్ లైసెన్స్ పొందొచ్చు.

అయితే యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ పొందాలంటే కనీసం పదేళ్లు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం లో సీనియర్ లెవెల్ బాధ్యతలు నిర్వహించి ఉండాలి. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు, సంస్థలు కనుక అయితే పదేళ్ల ట్రాక్స్ రికార్డ్‌తో పాటు రూ.5 వేల కోట్లకు పైగా అసెట్స్ కలిగి ఉండాలి.

ఇది ఇలా ఉంటే మరో 4 బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే వీటిల్లో వీసాఫ్ట్ టెక్నాలజీస్, కాలికట్ సిటీ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్, అఖిల్ కుమార్ గుప్తా, ద్వారా క్షేత్రియ గ్రామీణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే సంస్థలు ఉన్నాయి.

అలానే యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం నాలుగు సంస్థలు అప్లై చేసుకోగా… వీటిల్లో యూఏఈ ఎక్స్చేంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెప్కో బ్యాంక్, చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్, పంకజ్ వైశ్ అండ్ అదర్స్ అనే సంస్థలు ఉన్నట్టు తెలిపారు. వీటిల్లో చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ సంస్థకు ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ సారథ్యం వహిస్తున్నారు అని కూడా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version