రుణగ్రహితలకు గుడ్‌న్యూస్.. పాత రుణం చెల్లించకపోయినా.. కొత్త రుణం పొందొచ్చు.. ఎలాగో తెలుసా..?

-

అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఇసీఎల్‌జీఎస్) ద్వారా రుణం తీసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఆయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 26 రంగాలకు ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 2 నెలల కిందటే రుణం తీసుకున్నా.. వారు తిరిగి రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. రుణ గ్రహితలు సులభంగా రుణం అందేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగానికి సమాచారం అందజేసింది. ఈ జాబితాలో హెల్త్‌కేర్, ఏవియేషన్, సిమెంట్, భవన నిర్మాణాలు, కార్పొరేట్ రిటైల్, వస్త్రాలు, అవుట్‌లెట్ రంగాలు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ అధిపతి కేవీ.కామత్ కమిటీ సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ ద్వారా రూ.50-500 కోట్ల వరకు రుణం పొందిన వారికి ప్రయోజనం చేకూరనుంది.

డబ్బులు

రూ.60 వేల కోట్ల వరకు రుణం..
కరోనా దృష్ట్యా ఇసీఎల్‌జీఎస్‌ను రూ.3 లక్షల కోట్లకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 80 శాతం వరకు రుణం పొందవచ్చు. సుమారు రూ.60 వేల కోట్ల వరకు రుణాలు అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రుణాలు అందించేందుకు ప్రారంభించారు. కానీ, ఈ పథకం పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోలేదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ కొత్త సవరణ ప్రకారం.. ఈ స్కీమ్ 29 ఫిబ్రవరి 2020 నాటికి స్పెషల్ మెన్షన్ అకౌంట్ (SMA)-0 లేదా SMA-1 కింద వర్గీకరించబడిన ఖాతాను రుణగ్రహితలు పొందగలదు. దీని ద్వారా రుణగ్రహితలు సులభంగా రుణాలు పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా రుణం తీసుకున్న చిరువ్యాపారులు కూడా బెనిఫిట్స్ పొందవచ్చు. వారు కూడా రుణాలను తీసుకున్నా.. కొత్త రుణాన్ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version