హైదరాబాద్‌ వాసులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌..నగరంలో మరిన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు

-

హైదరాబాద్‌ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పటళ్లు కడుతున్నామని..త్వరలోనే అవి పూర్తి అవుతాయని మంత్రి హరీష్‌ రావు కీలక ప్రకటన చేశారు. ఫీవర్ ఆసుపత్రిలో 10.91 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కొత్త ఒపిడి బ్లాక్ శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్‌ రావు. అనంతరం 13 హార్సే వెహికల్స్, 3 అంబులెన్స్ ల ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఫీవర్ ఆసుపత్రిలో ఈరోజు రూ. 10.91 కోట్లతో కొత్త ఒపిడి బ్లాక్ ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దీంతో పాటు ఇదే వేదికగా 13 హర్సే వెహికల్స్ (పరమపద వాహనాలు), 3 అంబులెన్స్ లను ప్రారంభించుకున్నామని… దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పారు.

సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటగా ఈ హాస్పిటల్ ను విజిట్ చేశారు. హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణం 5 కోట్లు విడుదల చేశారని చెప్పారు.. ఫీవర్ ఆసుపత్రికి ఘనమైన చరిత్ర ఉందని.. 1915లో క్వారంటైన్ సెంటర్ గా మొదలైందన్నారు. కాలక్రమేణా అది కొరంటి ఆసుపత్రిగా పేరుగాంచిందని వెల్లడించారు. అంటువ్యాధులు అనగానే ముందుగా ఫీవర్ హాస్పిటల్ గుర్తుకు వస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version