నిర్మాణంలో ఉన్న ఇల్లు కుప్పకూలి 24 మంది కూలీలు సజీవ సమాధి అయ్యారు. పలువురు తీవ్ర గాయాల పాలు అయ్యారు. ఈ వివిషాదకర ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ లో ని శికార్పుర్ ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కాగ ఉత్తర ప్రదేశ్ లోని మేరఠ్ – బదాయా రహదారి పక్కన ఉన్న శికార్పుర్ కొత్వాలీ ప్రాంతంలో ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు.
ఈ ఇంటి నిర్మాణం కాంటాక్ట్ ను స్థానికంగా ఇల్లు నిర్మించే వ్యక్తి ఇచ్చాడు. కాగ శనివారం ఇంటి నిర్మాణం జరుగుతుండగా.. ఆ ఇల్లు ఆకస్మాతుగా కుప్ప కూలింది. దీంతో ఇంటి నిర్మాణంలో భాగంగా ఇంట్లో ఉన్న కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చాలా మంది ఇంటి కిందనే చిక్కుకున్నారు. అధికారులు సమాచారం అందుకుని.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల క్రింద ఉన్న వారిని బయటకు తీశారు. మొత్తం 24 మంది కూలీలు మృతి చెందారు. అలాగే నలుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తుంది. అలాగే పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.