50కి పైగా హత్యలు.. మరెన్నో నేరాలు.. డాక్టర్‌ అరెస్టు

-

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ జిల్లాకు చెందిన దేవేంద్ర శర్మ(62) అనే డాక్టర్ 50 కి పైగా హత్యలలో ప్రధాన నిందితుడిగా గుర్తించి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర శర్మ వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడు.బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆయుర్వేద, మెడిసిన్‌ అండ్‌ సర్జరీ) పట్టభద్రుడు. బిహార్‌లో విద్యనభ్యసించిన అతడు.. 1984లో జైపూర్‌(యూపీ)లో క్లినిక్‌ ప్రారంభించాడు.1992లో వ్యాపార రంగంలో దిగి భారీ నష్టాలు బారిన పడ్డాడు. వీటి నుంచి గట్టెక్కేందుకు అలీఘర్‌లో 1995లో ఓ ఫేక్‌ గ్యాస్‌ ఏజెన్సీ ప్రారంభించాడు.

docter
docter

ఆనాటి నుంచి నేరలను ప్రవృత్తిగా మార్చుకున్న శర్మ.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ రాకెట్‌లో కీలక సూత్రధారిగా మారాడు. పదేళ్లలో దాదాపు 125 అక్రమ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్లు చేయించి.. ఒక్కో ఆపరేషన్‌కు రూ. 5 నుంచి 7 లక్షలు వసూలు చేశాడు. అతిపెద్ద కిడ్నీ మాఫియా గా ఎదిగాడు.ఈ విషయం బయటపడటంతో పోలీసులు అరెస్టు చేయగా.. 2001లో విడుదలై మరోసారి గ్యాస్‌ ఏజెన్సీ దందా మొదలుపెట్టాడు. ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసే ట్రక్కు డ్రైవర్లను దోచుకోవడం మొదలుపెట్టాడు. ఈ గ్రామంలోనే 50కి పైగా డ్రైవర్లను హతమార్చాడు.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజస్తాన్‌, హర్యానాలో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి.ఈ క్రమంలో జైపూర్‌లో జరిగిన ఓ హత్య కేసులో యూపీ పోలీసులు అరెస్టు చేయగా స్థానిక కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. అయితే పెళ్లి చేసుకుంటాననే కారణం చూపి 20 రోజుల పెరోల్‌ మీద బయటకు వెళ్లిన అతడు.. స్వస్థలానికి చేరుకుని అక్కడే ఉండిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ప్రస్తుతం శర్మ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇప్పటికే అనేక కీలక విషయాలు అతని నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news