వ్యాక్సిన్ డోసుల్లో సగానికి పైగా వారికోసమే.. ఆక్స్ ఫామ్.

ప్రముఖ ఎన్జోవో సంస్థ ఆక్స్ ఫామ్, కరోనా వ్యాక్సిన్ పై సంచలన విషయాలు బయటపెట్టింది. ప్రస్తుతం తయారవుతున్న కరోనా వ్యాక్సిన్లలో సగానికి పైగా ధనిక దేశాల కోసమే రెడీ అవుతున్నాయని పేర్కొంది. ఆల్రెడీ సగం డోసులని ధనిక దేశాలు కొనుగోలు చేసాయని లేదా ఒప్పందం చేసుకున్నాయని అంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఆస్ట్రాజెంకా, స్పుత్నిక్, మోడెర్నా, ఫైజర్, సినోవాక్ ల నుండి ధనిక దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని చెబుతుంది.

ఈ ఐదు తయారీదారుల నుండి సుమారు 5.3బిలియన్ డోసులు తయారవుతున్నాయని, వాటిల్లో సగభాగం అనగా 2.7 బిలియన్ డోసులు యుఎస్, యుకే, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, హాంకాంగ్ మకావు, జపాన్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ దేశాలకి సరఫరా కానున్నాయని, మిగిలిన భాగం అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఇండియా, బంగ్లాదేశ్, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా మెక్సికో దేశాలు పంచుకోనున్నాయని వెల్లడి చేసింది.

ఐతే కరోనా ఎక్కడైనా కరోనానే అని, అందరి ప్రాణాలు ఒకటేనని, వ్యాక్సిన్ అనేది ప్రాంతాని బట్టి కాకుండా ఉండాలని అంటుంది. పీపుల్స్ వ్యాక్సిన్ పేరుతో ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని, కోవిడ్ కారణంగా ప్రపంచం ఖర్చు చేస్తున్న దానిలో ఉచిత వ్యాక్సిన్లకి ఒకశాతం కూడా అవదని పేర్కొంది.