తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి కాల్వలో దూకింది. కాగ అక్కడ ఉన్న కానిస్టేబుల్.. చిన్నారులను తల్లిని కాపాడాటానికి ప్రయత్నించాడు. కానీ చిన్నారులు ప్రవాహానికి కొట్టుకుయారు. తల్లి ప్రాణాలతో ఉన్నా.. ఇద్దరు చిన్నారులు మాత్రం మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాగ నంది పేట్ మండల కేంద్రంలో అమృత తన భర్త శ్రీనివాస్ తో నివాసం ఉంటుంది. కాగ భార్య భర్తల మధ్య గత 15 రోజుల నుంచి విభేదాలు వస్తున్నాయి. తరచూ గొడవ పుడుతున్నారు.
దీంతో తీవ్ర మనస్థపానికి గురి అయినా అమృత తన కుమార్తే మను శ్రీ (3), కుమారుడు మనుతేజ ( 6 నెలల పసి కందు ) తో కలసి అదే గ్రామంలో ఉన్న గుత్ప ఆర్గుల రాజారాం ఎత్తిపోతల కాల్వలో దూకింది. అ సమయంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ రాకేశ్.. అమృతను కాపాడారు. కానీ కాల్వ ప్రవాహం ఎక్కువ ఉండటంతో.. చిన్నారులు గల్లంతయ్యారు. కాల్వ ప్రవాహాన్ని నిలిపివేసి గాలించిగా.. ఇద్దరు చిన్నారుల మృత దేహాలు లభ్యం అయ్యాయి. కాగ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని భార్య భర్తలను అదుపులోకి తీసుకున్నారు.