మదర్స్ డే: చరిత్ర.. ప్రాముఖ్యత.. విశేషాలు.. కొటేషన్లు..

-

ప్రతీ ఏడాది మే నెల రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం 9వ తేదీన రెండవ ఆదివారం వచ్చింది. ప్రపంచంలోని అన్ని ప్రేమల కన్నా గొప్పదేదైనా ఉందంటే అది అమ్మ ప్రేమే. ఎందుకంటే ముందుగా మనకి దొరికేది అదే. 20వ శతాబ్దంలో అమెరికానకి చెందిన అన్నా వారిస్ మదర్స్ డే ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా మే రెండవ ఆదివారం రోజున మదర్స్ డే జరుపుకుంటున్నారు.

 

నిజానికి అమ్మ మీద ప్రేమ ప్రేమ వ్యక్తపరచడానికి ప్రత్యేకమైన రోజు ఉండాల్సిన అవసరం లేదు. ప్రతీరోజూ చూపించాలి. కానీ బిజీ బిజీ బ్రతుకుల మధ్య దేనికైనా ఒక రోజు ఉండి గుర్తు చేస్తూ ఉండాల్సి వస్తుంది. అదంతా అటుంచితే ఈ ప్రత్యేకమైన రోజున మీ మాతృమూర్తులకి అందమైన కొటేషన్లతో శుభాకాంక్షలు తెలియజేయండి.

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ అన్న రచయితకన్నా ఎక్కువగా నీ గురించి చెప్పాలనుంది.. కానీ మాటలు రావడం లేదు. చిన్నప్పుడు అన్ని మాటలు నేర్పిన నువ్వు నీ గురించి చెప్పడం మాత్రం ఎందుకు నేర్పలేదు. ఎప్పుడూ మా గురించి తప్ప నీ గురించి ఆలోచించని నీకు అదెక్కడ గుర్తుంటుందిలే. నేనెప్పుడైనా తప్పుగా మాట్లాడితే దానికేం తెలియదు ఇంకా చిన్నపిల్లే అనుకుంటూ నాలోని అమ్మని కూడా చిన్నపిల్లగా మార్చేసిన మా అమ్మకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు..

ప్రపంచంలో మాతృమూర్తులందరిలోకీ గొప్ప అయిన మా అమ్మకి.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version