రేపు మోత్కుపల్లి నర్సింహులు నిరాహార దీక్ష… !

-

రేవంత్‌ రెడ్డి తీరుకు నిరసనగా రేపు దీక్షకు దిగనున్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని…. దళిత సాధికారితకోసం సభలు, సమావేశాలు నిర్వహించి దళితుల సంక్షేమం కోసం, దళితుల అభ్యున్నతి కోసం ఉపన్యాసాలు ఇవ్వడం, దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలు నిర్వహించడం విస్మయానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జన్మతః దొరల వంశానికి చెందిన రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో దళితుల మధ్య నిద్రలు చేసి భోజనం చేయగలడా ? గత 70 సంవత్సరాలుగా ఎంత మంది దళితులు ఆయన ఇంటి ముందు నుండి చెప్పులు వేసుకొని నడిచారో రేవంత్ రెడ్డి చెప్పగలడా.? అని ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం ఎంతో శోచనీయమని ఫైర్‌ అయ్యారు. దళిత ముసుగు కప్పుకొని అణగారిన వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ వైఖరి సమంజసం కాదన్నారు. దళితులను ముందు వరుసలో నుంచోబెట్టి రాజకీయం చేయడం, దళితుల మీద ప్రేమ వలకబోసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడాన్ని పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నందుకు నిరసనగా ఈ నెల 29వ తారీఖు ఆదివారం బేగంపేట తన నివాసంలో ఒకరోజు దీక్షకు ఉపక్రమిస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version