ఈటల కోసం హరీష్ ద్విపాత్రాభినయం…

-

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం ఎలా వస్తుందో తెలియదు గానీ, ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికి మంత్రి హరీష్ రావు మాత్రం చాలా కష్టపడుతున్నారు. పైగా హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ గెలుపు బాధ్యతని కే‌సి‌ఆర్, హరీష్‌పైనే పెట్టారు. దీంతో హరీష్..హుజూరాబాద్‌పై ఫోకస్ చేసి రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈటలని ఓడించడానికి హరీష్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈటల కేవలం టి‌ఆర్‌ఎస్ నాయకుడు మాత్రమే కాదు… తెలంగాణ ఆర్ధిక మంత్రి కూడా. అయితే రెండు రకాలుగా  హుజూరాబాద్‌లో తన పాత్రని హరీష్ నిర్వర్తిస్తున్నారు. ఒక నాయకుడుగా హరీష్ … హుజూరాబాద్‌లో ఎలాంటి రాజకీయం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఈటెల రాజేందర్ ని దెబ్బకొట్టడానికి అనేక వ్యూహాలతో ముందుకెళుతున్నారు. హుజూరాబాద్‌లో ఈటలకు అండగా ఉన్న నాయకులని టి‌ఆర్‌ఎస్ వైపుకు తిప్పేస్తున్నారు. ఎక్కడకక్కడ సామాజికవర్గ సమీకరణాల పరంగా ఓటర్లని ఆకట్టుకునే ఎత్తులు వేస్తున్నారు. దూకుడుగా ఈటలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇక ఇటు ఆర్ధిక మంత్రిగా కూడా హరీష్ వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. దళితబంధుతో సహ ఇతర ప్రభుత్వ పథకాలు ప్రజలకు త్వరగా అందేలా చేస్తున్నారు. సాధారణంగా సంక్షేమ పథకాల కోసం ప్రజలు అధికారులు చుట్టూ ఎక్కువ తిరగాల్సి వస్తుంది. కానీ హుజూరాబాద్ ప్రజలకు ఆ పరిస్తితి లేకుండా హరీష్ చేస్తున్నారు. అర్హులైన వారికి ఠక్కున అధికారులతో మాట్లాడి పథకాలు అందేలా చేస్తున్నారు.

ప్రతి కులానికి సంక్షేమ పథకాలు అందేలా హరీష్ పనిచేస్తున్నారు. అసలు ప్రతి కుటుంబానికి వ్యక్తిగత ప్రయోజనం చేకూరడం వల్ల వారంతా పార్టీకి అండగా నిలుస్తారనేది హరీష్ ఆశ. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వెంటనే నిధులు విడుదల అయ్యేలా చూసుకుంటున్నారు. ఇలా ఈటలని ఓడించడం కోసం హరీష్ ఇలా ద్విపాత్రాభినయం చేస్తూ ముందుకెళుతున్నారు. మరి హరీష్ ద్విపాత్రాభినయం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version