ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరం మొత్తం ఏ రేంజ్లో జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రహదారులు మొత్తం పూర్తిగా వరద నీటితో నిండి పోయి పెద్ద పెద్ద నదీ ప్రవాహాలను తలపించాయి. ఈ క్రమంలోనే రోడ్లపై ఉన్న వాహనాలే కాకుండా ఇంటి దగ్గర పార్కు చేసిన వాహనాలు కూడా వరదలో కొట్టుకుపోయిన ఘటనలు కూడా మనం చూశాం. వరదల్లో చిక్కుకొని పూర్తిగా కొట్టుకుపోవడం లేదా మునిగిపోయిన వాహనాలన్ని పాడై పోతున్నాయి. దీంతో ఇప్పుడిప్పుడే వరదల నుంచి బయటపడుతున్న కొన్ని ప్రాంతాల్లో వాహనదారులు అందరూ తమ వాహనాలను రిపేర్ చేయించేందుకు సర్వీస్ సెంటర్లు క్యూ కడుతున్నారు.
ఇక అక్కడ వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని అన్ని ప్రాంతాలలో వరదనీటితో వాహనాలు రిపేరుకు రావడంతో నగరంలోని అన్ని సర్వీస్ సెంటర్ లలో స్లాట్లు బుక్కు కావడంతో రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఇక చేసేదేమీలేక వాహనాలను బాగు చేయించడానికి వాహనదారులు ఎంతో సమయం వేచి చూస్తూ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.