మోటొరోలా నుంచి కొత్త ఫోన్ చైనాలో లాంచ్ అయింది. మోటొరోలా రేజర్ 2022 క్లామ్‌షెల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్.. రేజర్ సిరీస్ ఫోన్లకు ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే భారత్ మార్కెట్‌లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి సేల్‌లో కేవలం ఐదు నిమిషాల్లోనే 10 వేల యూనిట్లు అమ్ముడుపోయిందని కంపెనీ ప్రకటించింది. ఇంతకీ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దామా..!
మోటో రేజర్ 2022 ధర..
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,999 యువాన్లుగా అంటే..సుమారు రూ.70,750గా నిర్ణయించారు.
12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 7,299 యువాన్లుగా అంటే సుమారు రూ.86,000గా ఉంది.
మోటో రేజర్ 2022 స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.7 అంగుళాల ఫోల్డబుల్ పీ-ఓఎల్ఈడీ ప్యానెల్‌ను అందించారు.
పంచ్ హోల్ డిస్‌ప్లే ఇందులో ఉంది.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, దీంతోపాటు హెచ్‌డీఆర్10+, డీసీ డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా ఉంది.
ఫోల్డ్ చేసినప్పుడు బ్యాక్ ప్యానెల్‌లో 2.7 అంగుళాల పీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత మై యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 3500 ఎంఏహెచ్‌గా ఉంది.
33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
డ్యూయల్ సిమ్, 5జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ-సీ పోర్టు ఇందులో ఉన్నాయి.
కెమెరా క్వాలిటీ..
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఈ ఫోన్‌కు వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.