ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పీకర్ హోదాలో ఉన్నప్పటికీని.. వైసీపీ నేత గానే ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు స్పీకర్. అయితే తాజాగా స్పీకర్ సీతారాం నోరు జారారు. ముఖ్యమంత్రి జగన్ కు బదులు మాజీ సీఎం నారా చంద్రబాబుకు ఆ క్రెడిట్ ఇచ్చారు.
గణతంత్ర వేడుకల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిన్న మాట్లాడిన స్పీకర్ సీతారాం… కరోనా కట్టడికి మన ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించకుండా ఉండలేమనని పేర్కొన్నారు. ఇది చాలా గొప్ప కౌన్సిలర్ పని… వాలంటీర్లతో జగన్ సర్కార్ చాలా సమృద్ధిగా పనిచేస్తుందని తెలిపారు.
ముఖ్యంగా కరుణ సమయం లో వాలంటీర్ల పనితీరు చాలా గొప్పది అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారని.. చంద్రబాబు నాయుడి డైనమిక్ లీడర్ షిప్ పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అనడంతో అందరూ విస్తుపోయారు. వెంటనే తప్పు తెలుసుకున్న ఆయన రద్దు చేసుకొని మన జగన్ మోహన్ రెడ్డి గారు అని సరి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది.