43 వేల కోట్ల దోపిడీ కేసులో జ‌గ‌న్‌ ఏ1 అయితే, మోపిదేవి ఏ7: నారా లోకేశ్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై మరోసారి నిప్పులు చెరిగారు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఏ 1 ముద్దాయి అంటూ మండిపడ్డారు. య‌థా లీడ‌ర్ త‌థా కేడ‌ర్… ప్ర‌జాధ‌నం 43 వేల కోట్ల దోపిడీ కేసులో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ ఏ 1 అయితే, వైసీపీ ఎంపీ మోపిదేవి ఏ7 విమర్శలు చేశారు నారా లోకేష్.

పాల‌కులే నేర‌గాళ్ల యితే వాళ్ల అనుచ‌రులు పాల్ప‌డే ఘోరాల‌కు అంతులేద‌ని మోపిదేవి వెంక‌ట‌ ర‌మ‌ణ‌ రైట్‌హ్యాండ్ భూశంక‌ర్ నిరూపించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. బాలిక‌ పై లైంగిక‌దాడికి పాల్ప‌డిన భూశంక‌ర్ లాంటి వైసీపీ బూచోళ్లు రాష్ట్రంలో ఊరికొక‌డున్నాడని ఫైర్ అయ్యారు. ఎన్ని నేరాలు చేసినా, త‌మ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపాడ‌తాడ‌నే ధైర్యం వ‌ల్లే ఈ అకృత్యాల‌కు అంతే లేకుండా పోతోందంటూ నిప్పులు చెరిగారు. వైసీపీ సర్కార్ పట్ల ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version