రాష్ట్రంలో హీరో సూర్య నటించిన సింగం మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఓ కామన్ మ్యాన్ ను అరెస్టు చేసేందుకు తెలంగాణ పోలీసులు 11 మంది ఏకంగా విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విషయం ఏమిటంటే..కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డికి, నాగ నందీశ్వర్ రెడ్డి అనే యువకుడికి మధ్య వ్యక్తిగత కారణాలతో వివాదం చెలరేగింది. తొలుత నాగ నందీశ్వర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా,కేసు పెట్టొద్దని బతిమాలిన తీగల కృష్ణారెడ్డి..
ఆ తర్వాత మళ్లీ నాగ నందీశ్వర్ రెడ్డిపై తీగల కృష్ణారెడ్డి అక్రమంగా మీర్‌పేట పీఎస్ లో కేసు పెట్టించినట్లు తెలిసింది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకునేందుకు మూడు పోలీస్ స్టేషన్ల నుంచి ఢిల్లీకి ఫ్లైట్‌లో 11 మంది పోలీసులు వెళ్లినట్లు సమాచారం.నోటీసులు ఇవ్వకుండా, యూనిఫాంలు, బ్యాడ్జీలు ధరించకుండానే ఇంట్లోకి ప్రవేశించి, కారణం కూడా చెప్పకుండా అక్రమంగా అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించినట్లు నందీశ్వర్ రెడ్డి తెలిపారు.
తన అక్రమ అరెస్టు విషయంలో ఢిల్లీ సాకెట్ కోర్టును నాగ నందీశ్వర్ రెడ్డి ఆశ్రయించగా..ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ తెలంగాణ పోలీసులకు ఢిల్లీ సాకెట్ కోర్టు మొట్టికాయలు వేసింది. తన అక్రమ అరెస్ట్‌పై తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో..అక్రమ అరెస్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ పోలీసులపై, ఢిల్లీ హైకోర్టులో నాగ నందీశ్వర్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 6 వారాల్లో తెలంగాణ డీజీపీ రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని పోలీసు వ్యవస్థను తీగల కృష్ణారెడ్డి వాడుకున్నట్లు సమాచారం.
ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి ఢిల్లీకి ఎలా వచ్చారంటూ.. పోలీసులతో తనకు ప్రాణ భయం ఉందంటూ నాగ నందీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సింగం సినిమా తరహాలో యువకుడి కోసం ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లిన 11 మంది తెలంగాణ పోలీసులు
అక్రమ అరెస్ట్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోని తెలంగాణ డీజీపీ
కాంగ్రెస్ నేత తీగల కృష్ణారెడ్డికి, నాగ నందీశ్వర్ రెడ్డి అనే యువకుడికి మధ్య వ్యక్తిగత కారణాలతో చెలరేగిన వివాదం
తొలుత నాగ నందీశ్వర్… pic.twitter.com/VUliooKH1c
— Telugu Scribe (@TeluguScribe) January 28, 2025